July 7, 2011

I'm waiting for you baby

వీచే గాలి మనల్ని తాకక మానదు..
మనల్ని తాకిన గాలి గుండెను చేరక మానదు!

వర్షం నేలను తాకకుండా పోదు..
నేలను తాకిన చినుకు నా కన్నీటి చుక్కను తుడవక మానదు!

కెరటం తీరాన్ని చేరక మానదు..
తీరాన్ని చేరిన కెరటాలలో ఏదో ఒకటి నా కాళ్ళను చేరక మానదు!

నే నీ కోసం చూసే ఎదురుచూపు మారదు..
నా ఎదురు చూపుకు, నీ చూపు ఏదో ఒక రోజు నా వైపు మల్లక మానదు!

ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby... - నీ తేజు

January 19, 2010

ప్రేమ అనే అలజడి రేపకు ....!

" నిర్మలమైన హృదయంలో ప్రేమ అనే అలజడి రేపకు
నాకు నేనుగా జీవించని స్వేచ్చా జీవిగా!
నా తలపులో దాగుంది సమైక్య ప్రపంచం
దూరం చేయకు ఈ భావ ప్రవాహం
నన్ను వేదజల్లని... శాంతి జల్లులు
అప్పుడు వికసిస్తాయి నవ్వుల హరివిల్లులు
ఈ జన్మకిది చాలు నేస్తం; నాకొద్దీ పైపై మెరుగులు! "

-తేజు

Few Love Poems

పరిచయం:

" పరిచయం అనే పూల మొక్కకు
హృదయం అనే పూలకుండిలో చోటిచ్చి
అభిమానం అనే నీరు పోస్తే
ప్రేమ అనే పువ్వు పూస్తుంది! "

ప్రేమ:

" కలలు కనే కళ్ళకు తెలుసు
ఆ కల చెదిరితే కారేవి కన్నేరని
ప్రేమించిన ప్రతి వ్యక్తికి తెలుసు
ఆ ప్రేమ విఫలమైతే జీవితమే వృధా అని! "

" విలువైన వజ్రం కన్నా
తాజ్ మహల్ అందం కన్నా
గులాభి రేకులు కన్నా
నువ్వే నాకు మిన్న "

" ప్రేమంటే మాట కాదు
పలక మీద గీత కాదు
చెరిపేస్తే చెరిగిపోదు
మనసిస్తే మరిచిపోదు "

" మొదట నువ్వు నాకో పరిచయం
తరువాత నువ్వో జ్ఞాపకం
ఇప్పుడు నువ్వే నా జీవితం
ఇకముందు నా మదిలో నీ స్థానం శాశ్వతం! "

" అందాల జలపాతమా
సిరివెన్నెల సుమగీతమా
కూచిపూడి కళానాత్యమా
బాపూ కళల చైతన్యమా
మరీ అంత దూరమా
నేను కన్న కలలు శూన్యమ లేకా తీరమా! "

~BY తేజు


నేనంటూ ఇక లేనని...

" సిరి,

నేనంటూ ఇక లేనని...
నా నీడ కూడా నీదేనని!

నాదంటూ ఏది లేదని...
ఇక నీవే నా చిరునామా అని!

నా మనసు నా దగ్గర లేదని...
అది ఎప్పుడో నీకిచ్చానని!

ఎలా తెలుపను ప్రియా...
ఇదే నా ప్రేమని! "

అక్షరం!

" అమ్మకంటే అవసరమైనది అక్షరం
అన్నమంత అవష్యమైనది అక్షరం
అట్టడ్ని అసాదారునిగా...
అసాహముడ్ని అత్యుత్తముడిగా ....
ఆలోచింపజేసేది అక్షరం అందుకే అదొక ఆయుధం! "


స్నేహం

" కలల సంద్రంలో అలల నిజానివి
గగన జగంలో స్నేహామ్రుతానివి
గగనసంద్రాలు ఎన్నటికీ వేరు
కానీ, మన చెలిమి సెలయేరు జీవనది అయి పారు! "

పుట్టుమచ్చ

" సిరి,

మన శరీరంపై వచ్చిన మచ్చలన్నీ పుట్టుమచ్చలు కావు!
చాలా మచ్చలు వస్తుంటాయి... పోతుంటాయి...;
బుగ్గన చుక్క పెట్టినపుడు ఆ కాటుక విర్రవీగిపోతుంది;
తనే ఆమెకి అందాన్ని ఇచ్చానని అనుకుంటుంది;
కాని, తరువాత ముఖం కడిగితే అది కరిగిపోతుంది.
అంటే! అది ఇచ్చే అందం స్వల్పకాలికమే!

ఇలానే కొందరు వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి
కొంత ఆనందాన్ని ఇచ్చి పోతుంటారు;
కానీ నిజానికి వాళ్ళు నిజమైన ఆప్తులు కాగలర?

ఆ సమయంలో మనకు నిజమైన అందాన్ని ఇచ్చే పుట్టుమచ్చని కానీ..
నిజమైన ఆనందాన్నిచ్చే వ్యక్తుల్ని కానీ.. మరిచిపోతాం!
స్వల్ప ఆనందాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం!!

ఎప్పటికీ.. నీ శరీరంపై నేనొక పుట్టుమచ్చని అని చెప్పడానికే నా ఈ తపన!
ఎప్పటికైనా... ఆ విషయం తెలుసుకున్తావనే నా ఈ నిరీక్షణ!! "

నీ... కనుసన్నలలో

సిరి!

నీ కనురెప్పల చాటున మాటువేసిన నేను;
నీ కనుబొమ్మల నడుమ నుదిటి బొట్టునై;
నీ కనుపాపలలో ప్రతిభిమ్బాన్నై;
నీ కనులకు అందాన్నిచ్చే కాటుకనై;
నీ కనుల నుండి జారే కన్నీటి బొట్టునై;
నీ కనులకు, శరీరానికి విశ్రాంతిచ్చే నిదురనై;
ఆ నిదురించే కనులలో ఓ స్వప్నాన్నై;
నీ కనుల క్రిందనే ఉంటూ మకరందాన్ని ఆశ్వాదించే నాశికాన్నై;
ఇలా అనుక్షణం నీ కనుసన్నలలోనే ఉండాలని పరితపిస్తున్న నన్ను
నీ కంటిలో నలుసులా చూస్తున్నావు...
ఎప్పటికైనా నీ కనులలో ఓ మధుర స్వప్నాన్ని కావాలనేదే నా ఆశ!!!

ఏనాడు చూసానో నీ రూపురేఖలు..

ఏనాడు చూసానో నీ రూపురేఖలు...
ఆనాడే రాశాను నా చూపులేఖలు!

నాలో ఎన్నో చిగురించాయి కొత్త ఆశలు...
వాటిని ఆహ్వానించవా నీ హృదయ లతలు!

గీశాను ఎన్నో నీ ముఖసౌందర్య చిత్రాలు...
వాటికి పంపవ మరి నీ బహుమతులు!

నాలో ఎన్నో పుట్టుకొస్తున్నాయి కొత్త ఊహలు...
వాటిని కరునిస్తాయా నీలోని అందాలు!

ఎప్పుడూ తెరిచే ఉంటాయి నా హృదయ తలుపులు...
నీ కోసం వేచి ఉంటాను ఎన్నయినా వసంతాలు!!

అందమైన పుష్పమా..

" అందమైన పుష్పమా...!
ప్రేమకు ప్రతి రూపమా...!
నా హృదయంలో మెలిగే మౌనగీతమా!
బాపూ గీసిన అపురూపమైన చిత్రమా!
కలలోంచి కదలివచ్చి కళాకారుడి చేతిలో చిక్కిన శిల్పమా!
పాటల పల్లకీకి తయారుచేసిన గానమా!
ఈ 'తేజ' కోసం చేసిన సుందరమైన చెక్కిళ్ళుగల చంద్రమా!
ప్రేమ అనే అంగీకారానికి అర్ధం నీ మౌనమా! "