January 19, 2010

ప్రేమ అనే అలజడి రేపకు ....!

" నిర్మలమైన హృదయంలో ప్రేమ అనే అలజడి రేపకు
నాకు నేనుగా జీవించని స్వేచ్చా జీవిగా!
నా తలపులో దాగుంది సమైక్య ప్రపంచం
దూరం చేయకు ఈ భావ ప్రవాహం
నన్ను వేదజల్లని... శాంతి జల్లులు
అప్పుడు వికసిస్తాయి నవ్వుల హరివిల్లులు
ఈ జన్మకిది చాలు నేస్తం; నాకొద్దీ పైపై మెరుగులు! "

-తేజు

Few Love Poems

పరిచయం:

" పరిచయం అనే పూల మొక్కకు
హృదయం అనే పూలకుండిలో చోటిచ్చి
అభిమానం అనే నీరు పోస్తే
ప్రేమ అనే పువ్వు పూస్తుంది! "

ప్రేమ:

" కలలు కనే కళ్ళకు తెలుసు
ఆ కల చెదిరితే కారేవి కన్నేరని
ప్రేమించిన ప్రతి వ్యక్తికి తెలుసు
ఆ ప్రేమ విఫలమైతే జీవితమే వృధా అని! "

" విలువైన వజ్రం కన్నా
తాజ్ మహల్ అందం కన్నా
గులాభి రేకులు కన్నా
నువ్వే నాకు మిన్న "

" ప్రేమంటే మాట కాదు
పలక మీద గీత కాదు
చెరిపేస్తే చెరిగిపోదు
మనసిస్తే మరిచిపోదు "

" మొదట నువ్వు నాకో పరిచయం
తరువాత నువ్వో జ్ఞాపకం
ఇప్పుడు నువ్వే నా జీవితం
ఇకముందు నా మదిలో నీ స్థానం శాశ్వతం! "

" అందాల జలపాతమా
సిరివెన్నెల సుమగీతమా
కూచిపూడి కళానాత్యమా
బాపూ కళల చైతన్యమా
మరీ అంత దూరమా
నేను కన్న కలలు శూన్యమ లేకా తీరమా! "

~BY తేజు


నేనంటూ ఇక లేనని...

" సిరి,

నేనంటూ ఇక లేనని...
నా నీడ కూడా నీదేనని!

నాదంటూ ఏది లేదని...
ఇక నీవే నా చిరునామా అని!

నా మనసు నా దగ్గర లేదని...
అది ఎప్పుడో నీకిచ్చానని!

ఎలా తెలుపను ప్రియా...
ఇదే నా ప్రేమని! "

అక్షరం!

" అమ్మకంటే అవసరమైనది అక్షరం
అన్నమంత అవష్యమైనది అక్షరం
అట్టడ్ని అసాదారునిగా...
అసాహముడ్ని అత్యుత్తముడిగా ....
ఆలోచింపజేసేది అక్షరం అందుకే అదొక ఆయుధం! "


స్నేహం

" కలల సంద్రంలో అలల నిజానివి
గగన జగంలో స్నేహామ్రుతానివి
గగనసంద్రాలు ఎన్నటికీ వేరు
కానీ, మన చెలిమి సెలయేరు జీవనది అయి పారు! "

పుట్టుమచ్చ

" సిరి,

మన శరీరంపై వచ్చిన మచ్చలన్నీ పుట్టుమచ్చలు కావు!
చాలా మచ్చలు వస్తుంటాయి... పోతుంటాయి...;
బుగ్గన చుక్క పెట్టినపుడు ఆ కాటుక విర్రవీగిపోతుంది;
తనే ఆమెకి అందాన్ని ఇచ్చానని అనుకుంటుంది;
కాని, తరువాత ముఖం కడిగితే అది కరిగిపోతుంది.
అంటే! అది ఇచ్చే అందం స్వల్పకాలికమే!

ఇలానే కొందరు వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి
కొంత ఆనందాన్ని ఇచ్చి పోతుంటారు;
కానీ నిజానికి వాళ్ళు నిజమైన ఆప్తులు కాగలర?

ఆ సమయంలో మనకు నిజమైన అందాన్ని ఇచ్చే పుట్టుమచ్చని కానీ..
నిజమైన ఆనందాన్నిచ్చే వ్యక్తుల్ని కానీ.. మరిచిపోతాం!
స్వల్ప ఆనందాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం!!

ఎప్పటికీ.. నీ శరీరంపై నేనొక పుట్టుమచ్చని అని చెప్పడానికే నా ఈ తపన!
ఎప్పటికైనా... ఆ విషయం తెలుసుకున్తావనే నా ఈ నిరీక్షణ!! "

నీ... కనుసన్నలలో

సిరి!

నీ కనురెప్పల చాటున మాటువేసిన నేను;
నీ కనుబొమ్మల నడుమ నుదిటి బొట్టునై;
నీ కనుపాపలలో ప్రతిభిమ్బాన్నై;
నీ కనులకు అందాన్నిచ్చే కాటుకనై;
నీ కనుల నుండి జారే కన్నీటి బొట్టునై;
నీ కనులకు, శరీరానికి విశ్రాంతిచ్చే నిదురనై;
ఆ నిదురించే కనులలో ఓ స్వప్నాన్నై;
నీ కనుల క్రిందనే ఉంటూ మకరందాన్ని ఆశ్వాదించే నాశికాన్నై;
ఇలా అనుక్షణం నీ కనుసన్నలలోనే ఉండాలని పరితపిస్తున్న నన్ను
నీ కంటిలో నలుసులా చూస్తున్నావు...
ఎప్పటికైనా నీ కనులలో ఓ మధుర స్వప్నాన్ని కావాలనేదే నా ఆశ!!!

ఏనాడు చూసానో నీ రూపురేఖలు..

ఏనాడు చూసానో నీ రూపురేఖలు...
ఆనాడే రాశాను నా చూపులేఖలు!

నాలో ఎన్నో చిగురించాయి కొత్త ఆశలు...
వాటిని ఆహ్వానించవా నీ హృదయ లతలు!

గీశాను ఎన్నో నీ ముఖసౌందర్య చిత్రాలు...
వాటికి పంపవ మరి నీ బహుమతులు!

నాలో ఎన్నో పుట్టుకొస్తున్నాయి కొత్త ఊహలు...
వాటిని కరునిస్తాయా నీలోని అందాలు!

ఎప్పుడూ తెరిచే ఉంటాయి నా హృదయ తలుపులు...
నీ కోసం వేచి ఉంటాను ఎన్నయినా వసంతాలు!!

అందమైన పుష్పమా..

" అందమైన పుష్పమా...!
ప్రేమకు ప్రతి రూపమా...!
నా హృదయంలో మెలిగే మౌనగీతమా!
బాపూ గీసిన అపురూపమైన చిత్రమా!
కలలోంచి కదలివచ్చి కళాకారుడి చేతిలో చిక్కిన శిల్పమా!
పాటల పల్లకీకి తయారుచేసిన గానమా!
ఈ 'తేజ' కోసం చేసిన సుందరమైన చెక్కిళ్ళుగల చంద్రమా!
ప్రేమ అనే అంగీకారానికి అర్ధం నీ మౌనమా! "

నా నువ్వు... :)

కవి కాలాన్ని మరిచినా....
కోకిల గానాన్ని మరిచినా....
రైలు గమ్యాన్ని మరిచినా....
చివరికి నువ్వు నన్ను మరిచినా....
నేను నిన్ను మరువలేను నేస్తం!!

నువ్వులేని నా జీవితచరితపుటల్లోని ప్రతి అక్షరం అర్ధరహితం;
నే రాసుకున్న ప్రతి పేజికి భావం నువ్వు;
నే అల్లుకున్న ప్రతి కథకి మూలం నువ్వు;
నే బ్రతికే ప్రతి క్షణానికి శ్వశావి నువ్వే...!!

నువ్వు నా మనసులో లేవు...
నువ్వు నా ఆలోచనలో లేవు ...
నువ్వు నా కళ్ళల్లోనూ లేవు..
నువ్వు నా శరీరంలో ఒక భాగానివి!
శరీరంలో ఏ భాగానికి నొప్పి పుట్టిన భరించలేము-
నువ్వు ఈ భాగము అని నేను చెప్పలేను!!
నువ్వు దూరం అయినప్పుడు వచ్చే బాధ ఎక్కడినుండి వస్తుందో కూడా తెలియదు...

నా జీవిత చిట్టచివరి క్షణంలో అయినా నీ ఒడిలో...
చేర్చుకుంటావనే చిన్ని ఆశతో ఆరని చూపుల దీపాలతో...
ఎదురుచూస్తున్న నీ నేస్తం - నీ తేజు

రెండు హృదయాల మద్య దూరం!!??

ఆమెకి నాకు మధ్యన ఉంది దూరం...
అది తనువులకే తప్ప, మనసులకు కాదు...
నా మనసు ఆమె హృదయంలో...
ఆమె మనసు నా హృదయంలో...
నిత్యం గుండె చప్పుడుని ఆలపిస్తూనే ఉన్నాయి!

సూర్య-చంద్రులు ఎంత దూరంలో ఉన్నా సమస్త జీవకోటికి కనిపిస్తారు.
అట్లే నేను ఎక్కడ ఉన్నా, నా హృదయ తలుపులు తెరిచిచూస్తే...
ఆమె మోము ప్రత్యక్షమవుతూనే ఉంటుంది;

సమస్త విశ్వంలో ఒకరికి అన్నిటికన్నా దగ్గరగా ఉండేది తన ప్రియురాలి మనసు మాత్రమే!
మిగతాది ఏదైనా అది దూరమే అవుతుంది;

మనసుకి మనసుకి మధ్య దూరం ఋణాత్మక అనంత విలువకు సమానం..;
ప్రపంచంలో ఏ ఒక్కరు కనుగోనలేని దూరం ఇది!
ఒకవేళ ఆ ప్రేమ విఫలమైనా సరే ఆ దూరాన్ని లెక్కించలేము..
అది ధనాత్మక అనంత విలువను చేరును!

అందువల్ల మనసుకు, మనసుకు మధ్య దూరం ఎంత దగ్గరో అంత దూరం కుడా!

So, Don't try to measure it.. :)

January 18, 2010

నన్ను నన్నుగా ప్రేమించే హృదయం కోసం..!

" కన్నుల ప్రమిదలలో; ఆశల వత్తులు చేసి ;
ఆరని చూపుల దీపాలతో.....
నేనింకా ఎదురుచూస్తున్నది రేపటి ఉదయం కోసం కాదు...
నన్ను నన్నుగా ప్రేమించే హృదయం కోసం!! "

ఫ్రెండ్

" నీ అపజయాలు చూసి కుంగిపోకుండా...
నీ విజయాలు చూసి పొంగిపోకుండా...
నీదంతా తనదని... తనదంతా నీదని...
అనుకునే ఫ్రెండ్ ఒకరుండటానికి మించిన
అదృష్టం ఈ జన్మలో మరొకటి ఉండదేమో..! "

ఓ... స్నేహమా!!


" నీతో కలిసి గడిపిన రోజులు నా తీపి జ్ఞాపకాలు...

ఆ జ్ఞాపకాల వడిలో నిదురపోవాలనుకుంటాను....
అంతలోనే నాకే తెలియని ఆవేదన నన్ను ఆవేదనకు గురిచేస్తుంది...
ఒక్క నీ మాటతో మరల వేల వేల కాంతులు నా జీవితంలో...;
నాలో చీకటి వలయాలన్నీ ఒక్కసారిగా తెరలు తెంచుకుంటాయి!!
ఓ... స్నేహమా! నాదొక చిన్ని కోరిక- కలకాలం నువ్వు నాతోనే ఉంటావు కదా!
ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటావనే చిన్ని ఆశతో జీవిస్తున్న.... "

January 12, 2010

కలయిక ఒక అధ్బుతం!!!

కలయిక ఒక అధ్బుతం....
ఇద్దరు కలవటం ఎంత తేలికో.. అంత కష్టం!
అందరు అందరితో కలవలేరు.... నేను ఒకరితో కలవాలనుకుంటే, ఒకరు నాతో కలవాలనుకుంటారు!అభిప్రాయలు, అహంభావం, తొడుగులు, సిద్ధాంతాలు, మనుష్యులు, కులాలు, మతాలు, సరిహద్దులు,..... ఇలా కలవనీయనిది ఏదైనా దుర్మార్గమే!
కలవటమా కలవకపోవటమా అన్నదే ముఖ్యం. కలిపేది ఏదైనా దాన్ని నేను గౌరవిస్తాను.
తరగతి గదో, దేవుని గుడో, కళాశాల మైదానమో, పండగో, పబ్బమో, పెల్లిపందిరో.... ఇలా కలిపేది ఏదైనా అది సన్మార్గమే!!!
ఇద్దరు కలిసి కరిగిపోవటం కన్నా గొప్ప అనుభూతేముంది జీవితంలో....
ఇద్దర్ని కలపటం కన్నా గొప్ప మహత్కార్యం ఏముంది ఈ ప్రపంచంలో....
శరీరంలో శరీరం కలవటం...
స్నేహంలో ప్రేమ కలవటం...
పాటలో ప్రాణం కలవటం...
కవితలో కరుణ కలవటం...
నెలలో వాన కలవటం...
మట్టిలో విత్తు కలవటం...
ఇలా ఏవి ఎలా కలిశాయన్నది కాదు, కలవటమే అన్నిటికన్నా ముఖ్యం!!!


జీవితం

" జీవితం కల కాదు... కలగా జీవితం మిగలదు;
అందని దాని కోసం ఆశ పడకు.... అందలేదని అంతలోనే నిరాశ చెందకు;
నీవు కోరుకున్న జీవితం నీకు ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఎదురుపడుతుంది;
నీ కోసమే వేచి, నీలోనే చేరుతుంది!
ఆ రోజు వచ్చేవరకు చేయాలి నీవు అన్వేషణ... అప్పటివరకు తప్పదు నీకు ఈ నిరీక్షణ!!! "

స్నేహం

నిద్రలో... మెలకువలో...; నింగిలో.. నీటిలో...;
నిశబ్దంగా శబ్దం చేసే కాలపు గడియారం మన స్నేహం!
నువ్వు నమ్మిన నీ లోకం నిన్ను ఒంటరిని చేసినపుడు....
అవమానపు చురకతులు నీ అభిమానాన్ని చిద్రం చేసినపుడు.....
ఈ స్వార్ధపు సమాజం నీ గుండెను గాయం చేసినపుడు.....
నీకు నేనున్నానని మరువకు నేస్తం!!!
నా సంతోషం నీది.... నీ విషాదం నాది.....
నిజమైన స్నేహం మన ఇద్దరిది ....!

January 8, 2010

నా బెస్ట్ ఫ్రెండ్ ..... అను

అను....!
నువ్వు, నాకు ఈ సృష్టిలో ఎవ్వరికి లభించని వరము 'అను'కుంటున్నాను....
'అను'దినం... 'అను'నిత్యం... 'అను'క్షణం.... ఒకరిని గురించి ఒకరు ఆలోచించే మనస్తత్వం మనది....
'అను'మానం అనే మాటకు తావివ్వనిది మన స్నేహం....
నీ వల్లనే స్నేహంలో మధుర'అను'భూతిని పొందాను
స్నేహానికి 'అను'రూపము.... 'అను'రాగమూ.... మనమే
మన స్నేహమే అన్నింటికన్నా 'అను'చితమయినది
ఎవరి జీవితంలో అయినా స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది..
నీ జీవితంలో ఆ స్థానానికి నాకు 'అను'మతిని కల్పించినందుకు నా కృతజ్ఞతలు
అలాగే మన తల్లిదండ్రులు..... శ్రేయోభిలాషులు.... కూడా మనకు 'అను'కూలంగా
ఉండడమే మన స్నేహ'అను'భలం
మన స్నేహాన్ని స్పూర్తిగా తీసుకొని భావితరాల వాళ్ళు మనల్ని 'అను'కరించాలని ఆశిద్దాం!!!
ఎప్పటికి నీ ప్రియ నేస్తం ఈ తేజ యే......

ఎప్పుడంటే అప్పుడు కవిత్వం రాదు!!

ఎప్పుడంటే అప్పుడు కవిత్వం రాదు
రమ్మని పిలిస్తే వచెది కాదు
ఏడాదికొకసారి పండగ వచినట్లు రాదు .
ఒక సన్నివేశానికి అనుగుణంగాను రాదు.
ఆకు కదలకపోయినా, గాలి ఆడక పోయిన, కవిత్వం రాదు.
శ్వాషకి, ఆలోచనకి మధ్య ప్రాణం గిలగిలలాడి
మనసు సమస్త ప్రక్రుతిలోనికి వెళ్లి
ఒక భావం గూర్చి తపన పడితే గాని రాదు.
గుండె తడవాలి, మనసు కరగాలి,
ఏదో స్పర్శ నిలువెల్లా తాకాలి,
మనసు నిర్మలంగా ఉండాలి.
అప్పుడు ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా కలం పట్టి కదిపితే
ఆ కవిత్వం నిరాటంకంగా సాగిపోతుంది.....
అంతేగాని ఎప్పుడంటే అప్పుడు కవిత్వం రాదు!
- తేజ

January 7, 2010

ప్రేమలో పడ్డ అమ్మాయి మనసులోని భావాలు!!


ఎప్పుడు ఎక్కడ మొదలయిందో తెలియదు...
భూగర్బ జల ధారల; వంపులు తిరుగుతూ వస్తున్నా పాములా;
అగ్ని పర్వతం నుండి వస్తున్న జ్వాలల ;
అకస్మాతుగా ఒక అపరిచితుడు సుపరిచితుడైనాడు...
పద్మంలో పరిమళం కోసం వచ్చిన తుమ్మెదలా వస్తాడు..
కాని ఆ పుష్ప రేకులదాక చేరి వెనుదిరుగుతాడు..
అది పరిమళ స్పర్శ కాదు.. ఎంతో దూరమూ కాదు..!
చూస్తే చూస్తాడు.. నవ్వితే నవ్వుతాడు..
ఏడిస్తే బాదపడతాడు..
కాని ఆ విషయానికి వస్తే మాత్రం జంకుతాడు!!
అతడు రాసే కవితల్లోనూ , పాడే పాటల్లోనూ , గీసే చిత్రాల్లోనూ... తన ప్రేమను తెలియపరిచినట్లే ఉంటాడు కాని తెలుపడు.. పోనీ నేనే చెప్దామా అంటే ధైర్యం చాలదు.. అలా అని నా మనసు మాత్రం ఆగదు...
Time Will Tell Everything....అని మనసు ఆపేస్తుంది!!!!