July 7, 2011

I'm waiting for you baby

వీచే గాలి మనల్ని తాకక మానదు..
మనల్ని తాకిన గాలి గుండెను చేరక మానదు!

వర్షం నేలను తాకకుండా పోదు..
నేలను తాకిన చినుకు నా కన్నీటి చుక్కను తుడవక మానదు!

కెరటం తీరాన్ని చేరక మానదు..
తీరాన్ని చేరిన కెరటాలలో ఏదో ఒకటి నా కాళ్ళను చేరక మానదు!

నే నీ కోసం చూసే ఎదురుచూపు మారదు..
నా ఎదురు చూపుకు, నీ చూపు ఏదో ఒక రోజు నా వైపు మల్లక మానదు!

ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby... - నీ తేజు

3 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. చాలా బాగా వ్రాశారు.. ఇలాంటి భావ కవితలు మీ బ్లాగ్ లో మరెన్నో చూడాలని అనుకుంటున్నాను.

    ReplyDelete