నేను! నేనంటే నాకు చాలా ఇష్టం! ఈ ప్రపంచంలో నన్ను నేను ఇష్టపడినంతగా ఇంకా ఎవరిని ఇష్టపడలేదు! నన్ను ఎంతోమంది అసహ్యించుకున్నా కూడా నా మీద నాకు ఎప్పుడూ కోపం రాలేదు! ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు!! నా గురించి నాకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు! నేను ఎక్కువ సేపు గడిపేది నాతోనే... ఎక్కువ సేపు మాట్లాడేది నాతోనే! అందుకే, నేనంటే నాకు చాలా ఇష్టం!! కానీ ఈరోజు నేను అనేవాడ్ని ఒకడు ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు మరియు మీరు! అందుకే మీరంటే కుడా నాకు చాలా ఇష్టం.. :) - ఇదే మీ నేను
January 7, 2010
ప్రేమలో పడ్డ అమ్మాయి మనసులోని భావాలు!!
ఎప్పుడు ఎక్కడ మొదలయిందో తెలియదు...
భూగర్బ జల ధారల; వంపులు తిరుగుతూ వస్తున్నా పాములా;
అగ్ని పర్వతం నుండి వస్తున్న జ్వాలల ;
అకస్మాతుగా ఒక అపరిచితుడు సుపరిచితుడైనాడు...
పద్మంలో పరిమళం కోసం వచ్చిన తుమ్మెదలా వస్తాడు..
కాని ఆ పుష్ప రేకులదాక చేరి వెనుదిరుగుతాడు..
అది పరిమళ స్పర్శ కాదు.. ఎంతో దూరమూ కాదు..!
చూస్తే చూస్తాడు.. నవ్వితే నవ్వుతాడు..
ఏడిస్తే బాదపడతాడు..
కాని ఆ విషయానికి వస్తే మాత్రం జంకుతాడు!!
అతడు రాసే కవితల్లోనూ , పాడే పాటల్లోనూ , గీసే చిత్రాల్లోనూ... తన ప్రేమను తెలియపరిచినట్లే ఉంటాడు కాని తెలుపడు.. పోనీ నేనే చెప్దామా అంటే ధైర్యం చాలదు.. అలా అని నా మనసు మాత్రం ఆగదు...
Time Will Tell Everything....అని మనసు ఆపేస్తుంది!!!!
Subscribe to:
Post Comments (Atom)
keka aripinchav le . kani ilantive inka try cheyi
ReplyDelete